Tuesday, 18 February, 2020

పచ్చ పురుగు


పచ్చ పురుగు

పురుగు ఆశించు కాలం: సెప్టెంబర్‌ – మార్చి

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • లోతుగా వేసవి దుక్కులు చేయడం వలన నిద్రావస్థలో ఉన్న పురుగులను నిర్మూలించవచ్చు.
  • పత్తిలో అలసందలు, వేరుశనగ, పెసలు లేదా సోయాబీన్‌ అంతర పంటగా వేసుకోవడం వల్ల రైతు మిత్రపురుగులైన అక్షింతల పురుగులు, క్రైసోపా, సిర్ఫిడ్‌ ఈగలు మొదలగునవి పెరిగి సహజ సస్యరక్షణ జరుగుతుంది. 
  • తల్లి పురుగు గుడ్లు పెట్టకుండా 5 శాతం వేప కషాయాన్ని పిచికారి చేయాలి.
  • ఎరపంటగా బంతి, బెండ గట్లపై నాటుకొని దానిపై ఆశించిన లార్వాలను, పురుగు గుడ్లను నాశనం చేయాలి.
  • పొలం చుట్టూ రక్షణ పంటగా జొన్న లేదా మొక్కజొన్న నాటుకోవాలి.

నివారణ :

  • పొలంలో ఎకరానికి 4 చొప్పున లింగాకర్షక బుట్టలను అమర్చుకొని పురుగు ఉధృతిని గమనించవచ్చు. 
  • పంట 45 రోజుల వయసులో తలలను తుంచడం వల్ల గుడ్లను నాశనం చేయవచ్చు.
  • పురుగు మందుల పిచికారి ఆపేయడం వల్ల పొలంలో రైతుమిత్ర పురుగులు పెరుగుతాయి. వీటిని మరింత ఎక్కువ చేయడానికి ట్రైకోగ్రామా పరాన్న జీవులను ఎకరానికి 60,000 చొప్పున (3 కార్డులు) పొలంలో పురుగు ఉధృతిని బట్టి 3-4 సార్లు వదలాలి. 
  • లార్వా చిన్నదశలో నివారించడానికి పచ్చిమిర్చి-వెల్లుల్లి కషాయాన్ని పిచికారి చేయాలి.
  • ఎన్‌పివి ద్రావణం ఎకరానికి 500 ఎల్‌.ఇ. చొప్పున పిచికారి చేసి పురుగులలో వైరస్‌ తెగులును వ్యాప్తి చేయాలి. 
  • పొలంలో ఎకరానికి 10 చొప్పున పక్షి స్థావరాలు ఏర్పాటు చేసి పురుగులను అదుపుచేసుకోవాలి. 

0 comments on “పచ్చ పురుగు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *