Tag Archives: వాతావరణం

రుతుపవనాల వ్యాప్తికి వాతావరణం అనుకూలం

విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు తెలంగాణ, కోస్తాంధ్రల్లో ప్రవేశించడానికి ఒకటి రెండు రోజులు పట్టే అవకాశం ఉందని విశాఖలని తుపాను హెచ్చరికలకేంద్రం తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌నుంచీ దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర తీరం మీద ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడింది. వీటి ప్రభావం వల్ల ఉత్తర కోస్తాలో పలు చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణల్లో కొన్నిచోట్ల వానలు, లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా వ్యాపించడానికి మరో రెండుమూడ్రోజులు పట్టవచ్చని అధికారుల అంచనా. అయితే ముందుగా ప్రిమాన్‌సూన్‌ షవర్స్‌ కురిసే అవకాశం ఉంది. రుతుపవనాలు వ్యాపించడానికి పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని వారు తెలిపారు.