andhrajyothi nalgonda

వాల్టాకు తూట్లు

(వేములపల్లి) ఆంధ్రప్రదేశ్ భూమి, నీరు, చెట్ల చట్టం (వాల్టా) అమలు అటకెక్కింది. పర్యావరణం, భూగర్భజలాలు, సహాజవృక్షసంపద పరిరక్షణ కోసం 200 2లో చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ద శాబ్దకాలంగా చట్టం అమలులో పారదర్శకత కొరవడి ఉల్లంఘన చర్య లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జి ల్లా, డివిజన్, మండల స్థాయి అధికారుల మధ్య అవగాహన లోపంతో చట్టం ఉల్లంఘనదారులపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వెలువడుతున్నాయి. అధికారుల్లో నెలకొన్న ఉదాసీనత వైఖరిని కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా వాల్టాచట్టం క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. బోరుబావుల తవ్వకం, చెట్లనరికివేత, నదు లు, వాగుల నుంచి ఇసుకతీత, తాగునీటి వనరుల కలుషితం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్టపడ కపోగా, వాల్టా చట్టంలోని నియమనిబందనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి.

ప్రత్యేక కమిటీలున్నా.. వాల్టా చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి కమిటీలకు కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మండల, డివిజన్‌స్థాయి కమిటీలో ప్రాధాన్యం కల్పించిన అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో చర్యలు మరుగునపడుతున్నాయి. నియమ నిబంధనలు వాల్టాచట్టం రూపొందించన సమయంలో భవిష్యత్ అవసరాలను దృష్టి లో ఉంచుకొని ప్రభుత్వం కొన్ని నిమయనిబందనలు అందులో పొందుపరిచారు.

బోరుబావుల రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ప్రతిబావి యజమానీ 10 రూపాయలను రెవెన్యూ కార్యాయలంలో చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. బోరు తవ్వకం సమంలో సమీపంలోని మరోబోరు, బావికి కనీసం 200 మీటర్ల దూరం పాటించాలి. కొత్తగా బోరుబావి వేసుకునే రైతు అధికారులకు సమాచారం ఇవ్వడం ద్వారా శాస్త్రీయపద్ధతులను అనుసరించి జియాలాజికల్ అధికారులు సర్వేనిర్వహిస్తారు. అధికారులు సూచించిన ప్రదేశంలో బోరుబావి పడకుంటే రూ.10వేల వరకు బాధితరైతుకు బీమా సౌకర్యం లభిస్తుంది. అయితే రైతుల్లో నెలకొన్న అవగాహన లోపంతో తమ ఇష్టానుసారంగా బోరుబావులు తవ్వించి ఆర్థికంగా నష్టపోతున్నారు.

రిగ్గుల రిజిస్ట్రేషన్ బోరుబావులు తవ్వే రిగ్గుల యజమాని రూ.10వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ లేకుండా బోరుబావులను తవుతున్న రిగ్గులను అధికారులు సీజ్‌చేయాల్సి ఉంటుంది. అలాంటి చర్యలేవీ లేకపోవడంతో రి గ్గుల యాజమాన్యాలు తమకు నచ్చిన ప్రదేశంలో బోరుబావి తవ్వకాలు చేపట్టి రైతుల నుంచి వేలాదిరూపాయాలు వసూలు చేస్తున్నారు.

నీటి కలుషితంపై నియంత్రణ భూగర్భజలాలు కలుషితం కాకుం డా నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి. పరిశ్రమలు, చేపలపెంపకం దారులు వ్యర్థపదార్థాలను నిల్వచేసి నీటి ప్రవాహంలో లేదా ము రుగునీటి కాల్వలోకి వదలడంతో వా తావరణ కాలుష్యం జరుగుతున్నది. ప్రధానంగా పారిశ్రామికవాడల్లో ఇ లాంటి సంఘటనలు అధికారుల కనుసన్నల్లో జరుగుతున్నా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.

ఇసుక రవాణాపై నిషేధం భూగర్భజలాలు అడుగంటిపోకుం డా గ్రామాల సమీపంలోని వాగులు, నదుల నుంచి ఇసుకరవాణాపై నిషే దం విధించారు. ఇసుకమేట మందం 2మీటర్లకంటే తక్కువగా ఉన్నట్లైతే ఆ యా ప్రాంతాల్లో ఇసుకతీతపై నిషేదచర్యలు అమలుచేయాలి. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇసుక రవాణాకు పాల్పడుతున్న వాహనాలను సీజ్ చేయడంతోపాటు రూ.10 వేల నుంచి 1లక్ష వరకు జరిమాన విధించవచ్చు. వాస్తవానికి అలాంటి చర్యలేవీ అధికారులు అమలు చేయడంలేదు.

చెట్లనరికివేతపై… మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీ, గ్రామపంచాయతీల పరిధిలో చెట్లను పరిరక్షించి వాతావారణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు రెవెన్యూ, అటవీ శాఖ, గ్రామపంచాయతీ అధికారులు కృషి చేయాలి. ఎవరైనా చెట్ల యజమానిచెట్లను తన అవసరాల కోసం పడ గొట్టాలనుకుంటే అధికారుల నుంచి అనుమతిపొందాలి. చెట్లను నరికివేసిన 30 రోజుల వ్యవధిలో సమీప ప్రదేశంలో రెండు మొక్కలు నాటాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులకు అప్పగించిన బాధ్యతలను క్షేత్రస్థాయి లో అమలు చేయకపోవడంతో గ్రామాల్లోని సహజ అటవీ వృక్ష సంపద తగ్గుతున్నది. బొగ్గుబట్టీల వ్యాపారులు గ్రామశివారు భూముల్లోని చెట్లను నరికించి కాల్చడంతో తయారైన బొగ్గొను ఇతరప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా సమీపగ్రామాల్లో వాతావరణ కాలుష్యం పెరుగుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>