ఆదర్శ రైతు నాగరత్నం నాయుడు

రెండు కిలోల వరి విత్తనంతో ఎకరం సాగు 92.5 బస్తాల ధాన్యం దిగుబడి

చీపురు పుల్లల నుంచి రుద్రాక్షల వరకూ సాగు

రంగారెడ్డి జిల్లా, జూన్ 26 : రైతు సదస్సులను ప్రారంభించేందుకు ఇటీవల సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు వచ్చారు. స్థానిక అధికారులతోపాటు ప్రజాప్రతినిధులంతా ఆయనకు సాదర స్వాగతం పలికారు. కానీ, నాగరత్నం నాయుడు ఇచ్చిన పుష్పగుచ్ఛం చూసి సీఎంతోపాటు వేదికపై ఉన్న వారంతా అబ్బురపడ్డారు. అనేక రకాల పూలతో తీర్చిదిద్దిన గుచ్ఛం ఆహూతులను కట్టిపడేసింది. ఆ పూలన్నీ అతని తోటలో విరబూసినవేనని తెలుసుకున్న వారంతా అవాక్కయారు. అభినందనలతో ముంచెత్తారు. హైదరాబాద్ శివారుల్లోని హయత్‌నగర్ మండలం తారామతిపేటలో కేవలం 11 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలోనే నాయుడు అద్భుతాలు సృష్టిస్తున్నారు. పెట్టుబడులు పెరిగి వ్యవసాయం లాభసాటి కాదనుకుంటున్న తరుణంలో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా, శ్రీవరి సాగులో దేశంలోనే ఆయన అత్యధిక దిగుబడి సాధించిన రైతుగా రికార్డుల్లోకెక్కారు. ఎకరాకు 92.5 బస్తాల దిగుబడి (బీపీటీ 5204) సాధించి రాష్ట్రానికి కీర్తి తెచ్చిపెట్టారు. 2004-05 సంవత్సరంలో శ్రీవరి సాగు విధానం ద్వారా ఆయన ఈ ఘనతను సాధించారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సమక్షంలో ఆయన పంట దిగుబడిని నమోదు చేశారు. దీంతో, అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి స్వయంగా వెళ్లి పంట పొలాన్ని సందర్శించారు. ఎంత సంపాదిస్తావ్!? అని ప్రశ్నించారు. సుఖంగా బతుకుతున్నా సార్! అని నాగరత్నం జవాబిచ్చారు. రెండోసారి మళ్లీ అదే ప్రశ్నను సంధించారు వైఎస్. అవినీతిపరుడు కాకుండా అత్యధిక జీతం తీసుకునే మీ ప్రభుత్వోద్యోగి కంటే ఎక్కువే సార్! అన్నది నాయుడు సమాధానం. చెప్పవయ్యా!? అని వైఎస్ అనగానే.. 'మీకంటే సుఖంగా బతుకుతున్నా సార్!' అన్న నాగరత్నం జవాబులో రైతు ఆత్మవిశ్వాసం సుస్పష్టమవుతుంది. తర్వాత కూడా నాగరత్నం ఏడాదికి ఎకరాకు సగటున 75 బస్తాలు తగ్గకుండా పంట పండిస్తున్నారు. ఫల పుష్ప ప్రదర్శన నాగరత్నం నాయుడు వ్యవసాయ క్షేత్రంలో పండని పంటే లేదు. అతిథులకు తన పొలంలోనే పండిన కాఫీ గింజలు, తేయాకుతో అప్పటికప్పుడే విందు ఇస్తారు. అక్కడ దాదాపు 70 రకాలకుపైగా పూలు, పండ్ల తోటలున్నాయి. మన రాష్ట్రంలో ఎక్కడా కనిపించని అరుదైన పుష్పజాతి, పండ్ల మొక్కలు అక్కడ కనిపిస్తాయి. బయో డైవర్సిటీ (జీవ వైవిధ్యం) ద్వారా వ్యవసాయ విధానాన్ని ఎంచుకుని మంచి ఫలితాలను సాధిస్తున్న నాగరత్నం వ్యవసాయ క్షేత్రంలో అతిశీతల ప్రాంతంలో పెరిగే మొక్కలూ దర్శనమిస్తాయి. స్మగ్లర్ వీరప్పన్ గంధపు చెక్కలతోపాటు సైకాస్ ఫ్యామిలీ అనే అటవీ మొక్కలను స్మగ్లింగ్ చేసేవాడు. ఆ అరుదైన మొక్క నాగరత్నం పొలంలో ఉంది. ఇది ఏడాదికి ఒకసారి పూత పూస్తుంది. అనేక సౌందర్య ఉపకరణాల్లో వాడే దీని సువాసన కిలోమీటరు వరకూ అదరగొడుతుంది. కేవలం హాలెండ్‌లోనే కనిపించే కొన్ని పుష్పాలూ ఇక్కడ ఉన్నాయి. 'బర్డ్ ఆఫ్ ప్యారడైజ్' అనే ఓ మొక్క ఉంది. దాని మొగ్గకు ఏడు రకాల పూలు పూస్తాయి. ఇది కూడా నాగరత్నం తోటలో కనువిందు చేస్తుంది. అలాగే.. బంతి, చేమంతి, గులాబీ, మందారం, కనకాంబరం, మల్లె వంటి పూల మొక్కలతోపాటు వందలాది అలంకరణ మొక్కలు కనిపిస్తాయి. వీటిలో హెల్కోనియా, జర్బారా, రెడ్ జింజర్, షవర్ జింజర్, కింగ్ ఆఫ్ ది ప్లవర్, హెల్కోనియా ప్యాడ్, వాలు జడ, మేరీ ప్లవర్, అస్పరాగస్, గోల్డెన్ గార్డ్ , సింగిల్ లిల్లీ, డబుల్ లిల్లీ, జర్బరా, కార్నేషియా, గ్లాడియోలాస్, జిప్పోఫిరాన్, లాక్స్ ఫర్, లేడీస్ లేజ్, లేడీ లింబోనియా, టార్చ్ జింజర్, రెడ్ రోజ్ క్యాండీ టఫ్, జప్సోపయా, హెల్కోనియా గోల్డ్, లేడీ హెల్కోనియా,హేంగింగ్, హెల్కోనియా పింక్ స్టార్, హెల్కోనియా రెడ్ స్టార్ వంటివి ఎన్నో ఉన్నాయి. అలాగే, అవిశె, ఉసిరి, లెమన్ గ్రాస్, కలబంద, అల్లం, మిరియాలు, పసుపు, కస్తూరి, పసుపు, సరస్వతి ఆకు, అడ్డసారతోపాటు కాకర, వంగ, బెండ, టమోటా, చిక్కుడు, గుమ్మడి, బీర, సొర, మునగ వంటి కూరగాయలు, వేరుసెనగ, ఆముదం వంటి నూనె గింజలూ ఇక్కడ పండుతాయి. ఒకేచోట కొన్ని రకాల మొక్కలు పెంచడం వల్ల వాటంతట అవే పోషకాలను తయారు చేసుకుంటూ మిగిలిన పోషకాలను పక్కన ఉన్న వాటికి అందచేస్తాయి. ఇలా ఓ మొక్క మరో రకం మొక్క ఎదిగేందుకు తోడ్పడుతుంది. ఒక్క ఆకుతో బిర్యానీ రెడీ సాధారణంగా బిర్యానీ వండాలంటే ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు వాడతారు. కానీ, నాగరత్నం తోటలోని 'ఆల్ స్పైసీ' అనే మొక్క ఆకు ఒకటి బిర్యానీ రైస్‌లో వేస్తే చాలు.. బిర్యానీ రెడీ!! ఎందుకంటే, మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు రుచులన్నీ ఈ ఆల్‌స్పైసీ ఆకులోనే ఉంటాయి. పచ్చి ఆకుతోనే నేరుగా బిర్యానీ చేసుకోవచ్చు. మరో విచిత్రమేమిటంటే.. నాగరత్నం ఇక్కడ ఓ యాపిల్ చెట్టు కూడా పెంచుతున్నారు. ఇది ఇప్పుడు ఏపుగా పెరిగింది. మరో ఏడాదిన్నరలోగా పూతకు వస్తుందని ఆయన చెబుతున్నారు. కష్టజీవి ఈ అద్భుతం ఆషామాషీగా ఆవిష్కృతం కాలేదు. కొండగుట్టలుగా ఉన్న 11 ఎకరాలను చదును చేయడానికి ఆయన ఐదేళ్లపాటు కష్టపడ్డారు. సుమారు 500 లారీల రాళ్లను అందులోంచి బయటకు తరలించారు. నాగరత్నం పాలిటెక్నిక్ చేస్తే.. ఆయన భార్య డిగ్రీ చదివారు. అయినా, చదువుకున్న డిగ్రీలను పక్కనపెట్టి భార్యాభర్తలు వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్నారు. వీరితోపాటు నాగరత్నం తల్లి కూడా రోజూ దిల్‌సుఖ్‌నగర్ నుంచి రోజు ఉదయం ఏడు గంటలకే బస్సులో పొలానికి వెళ్లి కూలీలతోపాటు పని చేసి సాయంత్రం తిరిగి వెళతారు. వ్యవసాయాన్ని ఉద్యోగంలా చేస్తూ జీవిస్తున్నామని వారు చెబుతారు. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని నాగరత్నం నమ్ముతూ దాన్నే ఆచరణలో చూపుతూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అవార్డుల పంట వ్యవసాయ క్షేత్రంలో నాగరత్నం నాయుడు వరి తదితర ఫల, పుష్ప పంటలతో అద్భుతాలు సృష్టిస్తుంటే.. అవన్నీ కలిసి ఆయన ఇంట్లో అవార్డుల పంటను పండిస్తున్నాయి. ఆయన ఇల్లే ఓ అవార్డుల పూదోటలా కనిపిస్తుంది. నాయుడుకు వచ్చిన అవార్డులు చూస్తే ఓ రైతుకు ఇన్ని అవార్డులా? అంటూ ముక్కున వేలేసుకోవాల్సిందే! నాలుగు అంతర్జాతీయ అవార్డులు, ఏడు జాతీయ అవార్డులతోపాటు మరో 394 అవార్డులు ఆయనకు లభించాయి. వరుసగా మూడుసార్లు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. రాష్ట్రస్థాయిలో ఉత్తమ రైతు అవార్డులకు లెక్కేలేదు. ఇక్రిశాట్, బంగ్లాదేశ్ పురస్కారాలు లభించాయి. శ్రీవరిపై ప్రచారం రాష్ట్రంలో శ్రీవరి సాగుతో అద్భుతాలు చేస్తున్న నాగరత్నం తన ప్రయోగ ఫలాలను నలుగురికీ పంచుతున్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు దేశ, విదేశాల్లో పర్యటనలు చేస్తున్నారు. దేశంలోని తమిళనాడు, కర్ణాటక, ఒడిసా, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌తోపాటు అనేక రాష్ట్రాల్లో జరిగిన రైతు సదస్సుల్లో పాల్గొని శ్రీవరిపై రైతులకు అవగాహన కల్పించారు. కేవలం ఒకే ఒక్క బోరు ఇన్ని అద్భుతాలను సృష్టిస్తున్నారంటే నాగరత్నం వ్యవసాయ క్షేత్రంలో నీటి వసతి చక్కగా ఉందని అనుకోవద్దు. కేవలం ఒకే ఒక్క బోరుతోనే ఆయన ఈ పంటలన్నీ పండిస్తున్నారు. సేంద్రియ ఎరువులే! రకరకాల పంటలు పండిస్తున్నా.. ఆయన ఎన్నడూ రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులూ వాడలేదు. సంప్రదాయ బద్ధంగా వస్తున్న సేంద్రియ ఎరువులనే వాడుతున్నారు. 30 ఏళ్ల వ్యవసాయంలో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండానే వివిధ పంటల సాగులో ఈ ఆదర్శ రైతు అనేక రికార్డులు సృష్టించారు.

రైతన్నకు దన్ను పంజాబ్ ‘దారి’!

వ్యవసాయ ఉత్పత్తుల మార్కె టింగ్ వ్యవస్థ రైతులకు పూర్తిగా ప్రతికూలంగా ఉన్నందున రైతు తను పండించిన పంటకు గిట్టు బాటు ధర పొందలేని పరిస్థి తిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రస్తుత ప్రభుత్వాల ఆర్థిక విధా నాల్లో దళారులే పైచేయిగా సాగుతున్న ఈ మార్కెట్ వ్యవస్థ రైతు ఆర్థిక స్థితిగతులను పూర్తి గా నష్టపరిచే రీతిగా మారింది. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు రాష్ట్ర విభజనతో సహా అనేక సమస్యలతో అనిశ్చితిలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అయోమయం లో పడిపోయినట్లు అనిపిస్తున్నది.

అనేక ఇబ్బందులతో, ప్రకృతి వైపరీత్యాలతో, భరించలేకుండా పెరిగిపోయిన సాగువ్యయంతో తద్వారా ఏర్పడిన ఆర్థికపరమైన కష్టనష్టాలతో సతమతమవుతున్న రైతును, తను పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించని స్థితిని మనం నిత్యం కళ్లప్పగించి చూస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలని, ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఉండాలని, గిట్టుబాటు ధర రావాలని, అంతిమంగా తన ఆర్థికస్థోమత పెరగాలని రైతు నిత్యం ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నాడు. అయితే ఇవేమీ జరగడం లేదు సరికదా! రోజురోజుకు రైతు పరిస్థితి దిగజారిపోతున్నది. ముఖ్యంగా చిన్న, సన్న కారు రైతుల పరిస్థితులు దయనీయంగా మారిపోతు న్నాయి. దిగాలుపడిన రైతులు ధైర్యం కోల్పోయి ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. వ్యవసాయం చేసేకన్నా కూలీకి పోతే కనీసం అప్పులు చేసే పని తప్పుతుందని, కడుపునిండా తిండి దొరుకుతుందనే భావన రైతాంగంలో దినదినం బలపడుతున్నది.

రైతుల అభద్రతా భావాన్ని ప్రస్తుత గడ్డుకాలంలో రెండు విపరీత పరిస్థితులకు ముడిపెట్టవచ్చు. మొదటిది పంట చేతికి అందకపోవడం. ఇది ప్రకృతి వైపరీత్యాల మూలంగా కావచ్చు లేదా వివిధ సాగుబడి ప్రమాణాలను పాటించకపోవడం వలన కావచ్చు.

రెండోది పండించిన పంటకు కనీస మద్దతు ధర రాక పోవడం. మద్దతు ధర రాకపోవడానికి కారణాలు వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండటం, ఆ లోపాలను దళారులు తమకు అనుకూలంగా మలచుకోవడం. మన దేశంలో మద్దతు ధరలను అంచనాలు వేసి ప్రకటించడానికి కమిషనర్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ ప్రైసెస్ (సీఏసీపీ) అనే ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఉంది. ఈ కమిషన్ ప్రతిపాదనలను రైతు సంఘాలు, బుద్ధిజీవులు, ప్రభుత్వం నియమించిన ఇతర కమిటీలు పరిశీలిస్తాయి. యూపీఏ ప్రభుత్వం ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్ నాయకత్వంలో నియమించిన జాతీయ రైతుల కమిషన్, రైతులకు కనీస మద్దతు ధరతోపాటు అనేక రాయితీలు కల్పించవలసిందిగా ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. సగటున పంట సాగుబడికయ్యే ఖర్చు మీద కనీసం 50 శాతం అధికంగా గిట్టుబాటు ధరలు ఉండాలని ఆ కమిషన్ నిర్దేశించింది. అయితే ఈ కమిషన్ ప్రతిపాదనలను ప్రభుత్వం పూర్తిగా అమలు పరచలేదు. మద్దతు ధరలను పెంచితే ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పోతాయనే ఆందోళనతో ఇదమిద్ధమైన నిర్ణయాలు ప్రభు త్వం తీసుకోలేకపోతోంది. వరి, గోధుమ, నూనెగింజలు, అపరాలు, పత్తి, మిరప వంటి పంటలకు సీఏసీపీ మద్దతు ధరలు పెంచినా, మితిమీరిన ద్రవ్యోల్బణం వలన, విపరీ తంగా పెరిగిపోయిన వ్యయం వలన రైతాంగానికి నికర లాభం ఉండటం లేదు.

ప్రభుత్వాలు రైతులకు దశాబ్దాలుగా అనేక రాయి తీలు కల్పిస్తూ వచ్చింది. రుణాలను మాఫీ చేయటం, వసూళ్లు నిలిపివేయడం, ప్రతికూల పరిస్థితుల్లో అసలు లేక వడ్డీ మాఫీ చేయటం, తక్కువ ధరకు ఎరువులు, విత్తనాలు సరఫరా చేయటం, ఉచిత వ్యవసాయ విద్యుత్తు వంటి అనేక కార్యక్రమాలను చేపడుతూనే ఉన్నాయి. ఇన్ని రాయితీలు, రైతు శ్రేయస్సుకు ఉద్దేశించిన ఎన్నెన్నో పథకాలు అమలవుతున్నా, రైతుకు ఈ దుస్థితి ఎందుకు దాపురించింది? ఈ రాయితీలు, పెట్టుబడులు, బ్యాంక్ రుణాలు వెచ్చించి రైతులు పంటలు పండిస్తుంటే జరుగు తున్నదేమిటి? రైతుకు ఒరుగుతున్నది ఏమిటి? ఆలోచిస్తే ఒళ్లు గగుర్పొడిచే నిజాలు కళ్లముందు కదలాడతాయి. రైతుకు గిట్టుబాటు ధర రాకుండా అడ్డుకుంటున్న దళారీ వ్యవస్థకు ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు కొమ్ము కాస్తున్నాయి. అంటే ఏమిటి? వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రభుత్వ పెట్టుబడులతోపాటు, మితిమీరిన వడ్డీలపై సేక రించిన మొత్తాలను పంట సాగుబడికి వినియోగిస్తుంటే, కొద్దో గొప్పో పెట్టుబడులతో దళారులు రైతుల దుస్థితిని సొమ్ము చేసుకుంటూ ఆరుగాలం వాళ్లు కష్టించి పండిం చిన ఫలాలను తన్నుకొని పోతున్నారు. దళారికి ప్రకృతి వైపరీత్యాలు లేవు, రుణాల బాధ లేదు, విత్తేది లేదు, ఎరువుల కొరత లేదు, నీటి ఎద్దడి లేదు, రేయింబవళ్లూ కరెంటు కోసం ఎదురుచూపులు లేవు. పెట్టుబడులు పెట్టి రైతులు పంటలు పండిస్తే తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభాల పంట పండించుకుంటాడు. పోనీ ఆహార ధాన్యాల వినియోగదారుడికి ఏమైనా లబ్ధి చేకూరుతోందా అంటే, అదీ లేదు. వినియోగదారుడు ఆహార ధాన్యానికి చెల్లించే విలువ, రైతుకు సగటున అందే ధర మధ్య ఉన్న వ్యత్యాసం ఏ గణితశాస్త్రవేత్తకు కూడా అంతుపట్టని అగణిత సమస్య. ఈ గడ్డు పరిస్థితికి కారణం రైతుకు బాస టగా నిలబడలేని వ్యవస్థలోనే ఉన్నదని ఘంటాపథంగా చెప్పవచ్చు.

ప్రభుత్వాల, సంబంధిత అధికార, అనధికార వర్గాల దశాబ్దాల నిలువెత్తు నిర్లక్ష్యం ఫలితం ఇది. ఒక పక్క ఈ సంవత్సరం వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లభించక రైతు పరిస్థితి బహుదీనంగా మారింది. దళారులు ధాన్యంలో లోపాలు ఉన్నవి లేనివి చూపించి క్వింటాలుకి కనీస మద్దతు ధర రూ.1,030గా ఉంటే, రూ.600 నుండి రూ.800లు మాత్రమే రైతు చేతిలో పెట్టి ధాన్యాన్ని కొనుగోలు చేశారు, చేస్తున్నారు. రైతుకి ఒక ఎకరా వరి పంటపై 15 నుండి 20 వేల రూపాయలు సాగుబడి మీద ఖర్చవుతూ ఉంటే 600 నుండి 800 వందలకి ధాన్యాన్ని అమ్ముకోవలసిన పరిస్థితి ఉండటం ఎంత ఘోరం! పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రైతుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి దళారులను కట్టడి చేశాయి. మన రాష్ట్రంలో వైఎస్ హయాంలో మార్క్‌ఫెడ్ లాంటి సంస్థల ద్వారా పసుపు, మిరప వంటి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయించి, దళారుల ఎత్తుగడలను తిప్పికొట్టారు.

ప్రస్తుతం నెలకొన్న దుస్సహ పరిస్థితుల్లో ఇప్పటికైనా నివారణోపాయాలపై ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థ లు, రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు, ఆర్థిక శాస్త్ర వేత్తలు కలసికట్టుగా తక్షణమే కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడు కోవాలి. వాస్తవానికి అనతి కాలంలో రాష్ట్రానికి, దేశానికి ఆహార భద్రత పెను సమస్య కాబోతున్నది. కానీ ధాన్యం మన గోదాముల్లో పుష్కలంగా ఉందని, ఎక్కువయి పురుగుబట్టి పోతుందని, రైతులు అవసరానికి మించి సాగు చేస్తున్నారని తర్కించే వారు కూడా లేకపోలేదు. అదృష్టవశాత్తూ అటువంటి కుహనా మేధావుల మాటలను చెవిన పెట్టే వారు ఇంకా మన సమాజంలో అల్ప సంఖ్యా కులుగానే ఉన్నారు.

అయితే ప్రస్తుత పరిస్థితిలో పండించిన ధాన్యాన్ని నిలువచేసేందుకు చాలినన్ని గోదాములు ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థల వద్ద లేవు. రైతులు తమను చుట్టుముడుతున్న ఆర్థిక సంకటాలను తట్టుకోలేక సాగుబడి చేసే శక్తి కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా 40 శాతం మంది రైతులు సేద్యానికి స్వస్తి చెప్పాలని ఆలోచిస్తున్నారన్న చేదునిజాన్ని 2009 సెప్టెంబర్‌లో నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చి (ఎన్‌సీఏసీ) సంస్థ తమ విస్తృత పరిశోధనల ద్వారా నిగ్గు తేల్చింది. ప్రస్తుతం వ్యవసాయ పట్టభద్రులు, ఇతర రంగాలకు చెందిన విద్యాధికులు వ్యవసాయ వృత్తిని చేపట్టడానికి ముందుకు వచ్చే పరిస్థి తులు లేవు. ఈ విషమ పరిస్థితుల నుండి బయట పడాలంటే ప్రభుత్వ ఆలోచనా సరళిలో మౌలికమైన మార్పు రావాలి. అన్ని విధాలుగా రాయితీలు కొన సాగిస్తూ రైతాంగానికి చేయూతనందించడం దాని విధి. సమగ్ర రాష్ట్రీయ వ్యవసాయ విధానానికి నాంది పలకాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుకు కనీస మద్దతు ధర లాభ సాటిగా ఉండే విధంగా, లొసుగులు లేకుండా మార్గదర్శక సూత్రాలను పొందుపరచాలి. దళారీ వ్యవస్థ నుండి రైతులను కాపాడవలసిన ఆవశ్యకతను గుర్తించాలి. వ్యవ సాయం వృత్తి-ప్రవృత్తిగా స్వీకరించే వారికి ఈ విధాన నిర్ణయాలు ఉత్తేజం ఇవ్వాలి. సంబంధిత చట్టాలను కూడా పకడ్బందీగా రూపొందించాలి. ఇటువంటి సత్వర చర్యల ద్వారా మన దేశాన్ని ముందుకు నడిపించినప్పుడే ఆహార భద్రత విషయంలో ఆందోళనకు లోనుకావలసిన అవసరం ఉండదు.

-డా॥శరత్‌బాబు, ప్రధాన శాస్త్రవేత్త , నేషనల్ బ్యూరో ఆఫ్
ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్
హైదరాబాదు

(సాక్షి దినపత్రిక లో వచ్చిన వ్యాసం) http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/15062011/4

అనంతపూర్ జిల్లా లో రైతు ఆత్మ హత్యలు

కృషి మీడియా: 14-06-2011కరువు పీడిత అనంతపూర్ జిల్లా లో గత పది రోజుల లో 10 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవటం సంచలనం సృష్టించింది. వరుస కరువులు, పంట నష్టాలూ, పెరుగుతున్న అప్పులు రైతులను బలి తీసుకున్నాయి.  సి,కే. పల్లి మండలం ప్యాదిండి గ్రామానికి చెందినా ప. నారాయణ రెడ్డి, తన 14 ఎకరాల భూమిని సాగులోకి తేవటానికి, నాలుగు బావులు తవ్వటానికి రెండు లక్షల అప్పు చేసాడు.  బొప్పాయి, జమ తోట వేయాలని చేసిన ఈ ప్రయత్నం నీరు పడకపోవటం తో బెడిసి కొట్టింది.
ఖరిఫ్ లో 8.5 లక్షల హెక్టారు లలో  వేరుశనగ పండించి రాష్ట్రం లో నే మొదటి స్తానం లో నిలిచే అనంతపూర్ జిల్లా, గత ఐదు సంవత్సరాలుగా పంట నష్ట పోతునే వుంది.  పెరుగుతున్న అప్పులు, అవసరాలు రైతులని నిరాస నిస్పృహలకు గురి చేస్తున్నాయి.
మడకశిర మండలం ఎచ్చేలేద్ది గ్రామం లో ముప్పై ఐదు సంవత్సరాల ప్రేమనాథ్ ఉరి పోసికుని ఆత్మహత్య చేసుకున్నాడు., అలా కంబడుర్ గ్రామానికి చెందినా మంజునాథ్ అనే కౌలు రైతు, నలుగు లక్షల అప్పు తీర్చ లేక పురుగు మందు తాగి ఆత్మ హత్య చేసుకున్నాడు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, వాతారణ ప్రతికూలత రైతుల జీవితాలతో ఆడుకుంటూనే వున్నాయి

తక్కువ ధరలకే ఎరువులివ్వండి; ఐ.ఐ.ఎం. అహ్మదాబాద్

నివేదిక పూర్తి పాఠం

తక్కువ ధరకే ఎరువులివ్వండి అప్పుడే ఆహారోత్పత్తిలో స్వయంసమృద్ధి తేల్చిచెప్పిన ఐఐఎం (అహ్మదాబాద్‌) అధ్యయనం అహ్మదాబాద్‌ఆహారోత్పత్తిలో దేశం స్వయం సమృద్ధిని సాధించాలంటే వ్యవసాయోత్పత్తుల ధరలు పెంచుకొంటూ పోవటం కన్నా రైతులకు తక్కువ ధరలకే ఎరువులు లభ్యమయ్యేలా చూసేందుకు ప్రాధాన్యమివ్వాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘భారత్‌లో ఎరువుల డిమాండ్‌: 2020నాటికి అవసరాలు”అనే అంశంపై ఐఐఎం (అహ్మదాబాద్‌)కు చెందిన ప్రొఫెసర్‌ విజయ్‌పాల్‌ శర్మ, హ్రిమా థాకర్‌ ప్రత్యేక అధ్యయనం నిర్వహించారు. 2020 నాటికి దేశంలో ఎరువుల వార్షిక డిమాండ్‌ 4.16కోట్ల టన్నులుగా ఉంటుందని అంచనా వేశారు. నీటి వసతి, అధిక దిగుబడి వంగడాలు, పంటల సాంద్రత వంటి అంశాలు ఎరువుల వినియోగాన్ని అధికంగా ప్రభావితం చేస్తాయని ప్రొఫెసర్‌ శర్మ తెలిపారు. ఎరువుల ధరల పెంపు పంటల సాగుపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందన్నారు. వ్యవసాయోత్పత్తుల ధరలు పెంచటం కన్నా తక్కువ ధరలకే ఎరువులను అందించటం శ్రేయస్కరమని అభిప్రాయపడ్డారు. తద్వారా దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అధికమవుతుందని చెప్పారు. వ్యవసాయోత్పత్తుల ధరల పెంపు వల్ల పంటను మార్కెట్‌కు తరలించే పెద్దపెద్ద రైతులే లాభపడతారని, అదే పంటల పెట్టుబడి వ్యయాన్ని తగ్గిస్తే రైతులందరికీ ఉపయోగమని విశ్లేషించారు.అధ్యయన విశేషాలు: 1951-52లో ఎరువుల వినియోగం దేశవ్యాప్తంగా 66 వేల టన్నులు. 2009-10కి అది 2.65 కోట్ల టన్నులకు పెరిగింది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  • 1951-52లో సగటు ఎరువుల వినియోగం హెక్టారుకు కిలో మాత్రమే.2009-10లో అది 135 కిలోలు.
  • అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే మన సగటు ఎరువుల వినియోగం చాలా తక్కువ.
  • దేశంలోని ప్రాంతాల మధ్య కూడా ఈ తేడా అధికంగా ఉంది. దేశ తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో… పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో కన్నా ఎరువుల వినియోగం అధికం.
  • ఎరువుల వాడకంలో చైనా తర్వాత స్థానం మన దేశానిదే.
  • దేశంలో ఇటీవల ఎరువుల గిరాకీ, సరఫరాల మధ్య అంతరం అధికమయ్యింది. దీంతో దిగుమతులపై అధారపడడం పెరిగింది.
  • 2000 సంవత్సరలో 20 లక్షల టన్నుల ఎరువులు దిగుమతి చేసుకోగా 2008-09కి అది 1.02 కోట్ల టన్నులకు పెరిగింది.

ప్రైవేటుకు పత్తి తాకట్టు! మోన్‌శాంటో ముందు మోకరిల్లిన సర్కారు-పరిశోధనల జోలికెళ్లని రంగా వర్శిటీ

ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు, పైరవీల ఫలితం గోగునార శాస్త్రవేత్తకు పత్తి బాధ్యతలు

హైదరాబాద్‌ – న్యూస్‌టుడే

సర్కారీ పెద్దలు మోన్‌శాంటోకు మోకరిల్లిపోయారు… మన పత్తి రైతుల్ని ప్రైవేటు కంపెనీలకు తాకట్టు పెట్టేశారు…!వరి, వేరుసెనగ తర్వాత అంత ఎక్కువగా అరకోటి ఎకరాల్లో లక్షలాది మంది రైతులు పండించే పత్తి పంటను పూర్తిగా ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి నెట్టేసి వారి దయాదాక్షిణ్యాల మీద రైతులు బతకాల్సిన దుస్థితిని సృష్టించారు మన పెద్దలు! అందుకే పత్తిపై ఏమాత్రం పరిశోధనలూ జరగడంలేదు. దేశంలోనే పేరొందిన ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రైతుల గోడు వినిపించడం లేదు. బీటీ విత్తనాలపై ఆరేళ్లుగా రాష్ట్రంలో గొడవ జరుగుతున్నా దానికి ధీటుగా మరో వంగడాన్ని రూపొందించడానికి విశ్వవిద్యాలయం ప్రయత్నించిన పాపాన పోలేదు. పత్తి పరిశోధనా విభాగానికి కోట్ల రూపాయల ఖర్చవుతున్నా ఫలితం శూన్యం. ప్రభుత్వ పెద్దలు, ప్రైవేటు కంపెనీల వత్తిళ్లు పరిశోధనలను నీరుగారుస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రైతాంగం బీటీ విత్తనాల కొరతతో అల్లాడుతున్న నేపథ్యంలో అసలు విశ్వవిద్యాలయం వారికి చేస్తున్న సాయం ఏమిటని ‘న్యూస్‌టుడే’ పరిశీలన జరపగా ఆసక్తికరమైన అంశాలెన్నో వెలుగుచూశాయి.

  • రంగా వర్శిటీకి రాష్ట్రంలో ఐదు ప్రాంతీయ పత్తి పరిశోధన కేంద్రాలున్నాయి. గుంటూరు జిల్లా లాం పరిశోధన కేంద్రం వీటిలో ప్రధానమైంది. ఇక్కడ పత్తిపై పరిశోధనకు అధిపతిగా చెంగారెడ్డి అనే ప్రొఫెసర్‌ను నియమించారు. వాస్తవానికి ఆయన గోగు పంట, గోగునారపై పరిశోధనకు కోసం ఉద్దేశించిన ఉద్యోగంలో చేరారు. గోగునార ప్రొఫెసర్‌కు పత్తి పరిశోధనతో సంబంధం ఏంటని అడిగే నాథుడే లేకపోవడంతో ఆయన పత్తి విభాగంలోనే కొనసాగుతున్నారు.
  • గోగునార పరిశోధన కేంద్రం ఆముదాలవలసలో ఉంది. అక్కడ పనిచేస్తున్న ప్రొఫెసర్‌ను ప్రత్యేకంగా తెచ్చి పత్తికి అధిపతిగా నియమించారు. గతంలో విశ్వవిద్యాలయాన్ని ఏలిన పెద్దలకు కావల్సిన వ్యక్తి కావడం, పైగా ఆయన గతంలో కొంతకాలం ప్రైవేటు పత్తి విత్తన కంపెనీల్లో పనిచేసి ఉండడం గమనార్హం.
  • కొన్నేళ్లుగా రైతులు 90 శాతం బీటీ పత్తి విత్తనాలనే వాడుతున్నారు. వీటిపై ఇంతవరకూ విశ్వవిద్యాలయంలో పరిశోధనే ప్రారంభం కాలేదంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలో కొందరు శాస్త్రవేత్తలు అనుమతి అడిగినా ‘పెద్దలు’ ఒప్పుకోలేదని సమాచారం

కోట్లు తిన్నా… పరిశోధనలేవి?

గత ఆరేళ్లలో విశ్వవిద్యాలయం పత్తి పరిశోధనా కేంద్రాల మీద దాదాపు రూ. 10 కోట్ల నిధులను ఖర్చుపెట్టినట్లు అంచనా. ఇంత ఖర్చవుతున్నా ఫలితం శూన్యం. చి అమెరికాకు చెందిన మోన్‌శాంటో కంపెనీకి బీటీపై పేటెంట్‌ హక్కు ఉందనే సాకుతో పరిశోధనను తొక్కిపెట్టారు. వాస్తవానికి ఇతర ప్రైవేటు కంపెనీల మాదిరిగా బీటీ పరిజ్ఞానాన్ని మోన్‌శాంటో నుంచి కొని దానినుంచి మరింత అధిక దిగుబడినిచ్చే వంగడాల తయారీకి కృషి చేయవచ్చు. కానీ అలాంటి ప్రయత్నమే జరగలేదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. చి రాష్ట్రవ్యాప్తంగా పత్తిసాగయ్యే విస్తీర్ణంలో మూడోవంతు మాత్రమే బీటీ సాగుకు అనుకూలమని, అన్ని ప్రాంతాల్లో అది వేయాల్సిన అవసరం లేదంటూ గతంలో ఇదే విశ్వవిద్యాలయం ప్రకటించింది. మరి ఆ విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా విస్తృతంగా ఎందుకు ప్రచారం చేయడంలేదు?

పెద్దల ఒత్తిళ్లు

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొత్త హైబ్రీడ్‌ వంగడాలు తయారైతే బీటీ విత్తనాల విక్రయాల వ్యాపారం తగ్గుతుందనే భయంతో కొన్ని ప్రైవేటు కంపెనీలు సైతం పరిశోధనను నీరుగార్చేందుకు ఉన్నత స్థాయిలో వత్తిళ్లు తెస్తున్నాయని కొందరు శాస్త్రవేత్తలే కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే కేవలం 33 శాతం విస్తీర్ణంలో సాగు చేయాల్సిన బీటీ విత్తనాలు నేడు 90 శాతానికి విస్తరించాయని వారు వాపోయారు. చి బీటీ విత్తన ప్యాకెట్లపై ఈ ఒక్క సీజన్‌లో రాష్ట్రంలో రైతులు రూ. 1500 కోట్లు ఖర్చుపెడుతున్నారు. కనీసం ఇందులో పదిశాతం ప్రభుత్వం కేటాయించి పరిశోధనలకు పూనుకుంటే అతి తక్కువ ధరకే హైబ్రీడ్‌ విత్తనాలు అందుబాటులోకి వచ్చేవని నిబద్ధత గల శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

జీ.డి.పి. పెరిగితే రైతుకు ఒరిగేదేమిది? దేవిందర్ శర్మ

అఖిల భారత కిసాన్ సభ 75 వ వార్షికోత్సవం సందర్బంగా హైదరాబాద్, ప్రెస్ క్లబ్ లో దేవిందర్ శర్మ గారు చేసిన ప్రసంగం పూర్తి పాటం

మద్దత్తు ధరలు

కృషి మీడియా: 10-06-2011

మద్దతు ధరలు పెంచుతూ కేంద్ర కాబినెట్ నిర్ణయం తీసుకుంది. క్వింటాలు వరి కి  రూ. 80/-  పత్తి కి రూ. 300/- కందికి రూ. 200/-  పెంచారు.  ఇప్పటి వరకు సాధారణ వరికి  వున్న రూ. 1000 నుంచి రూ. 1080 కి పెరుగుతుంది, అలాగే ‘ఏ’ గ్రేడు రకానికి రూ. 1030 నుంచి రూ. 1110 కి పెంచారు.  ధరలు 64 శాతం పెరగరం వలన ఆ పెంపు చేసామని ఆర్ధిక వ్యవహారాల కేంద్ర కమిటి తెలియ చేసింది.  అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రూ. 2300 కేంద్రం ఇవ్వక పోతే…రాష్ట్ర ప్రభుత్వం బోనస్ రూపం లో ఇస్తుందా అన్నది చూడాలి. క్రితం సరి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బోనస్ లు ప్రకటించి నప్పటికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు.  పెట్టుబడి ఖర్చులు 64 శాతం మేర పెరిగాయని చెపుతున్న కేంద్ర ప్రభుత్వం , పెరుగుతున్న జీవన వ్యయాన్ని పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించటం లేదు. ఆహార ద్రవ్యోల్బణం 9.01 అని ఇప్పటికే ప్రభుత్వం అంచనా వేసింది.    

పత్తి రైతుల పై విత్తన కత్తి


పత్తి విత్తనాలు అడిగిన పాపానికి రైతులపై లాఠీలు విరిగాయి. విత్తనం కోసం ఆరాటపడిన అన్నదాత పోలీసు దెబ్బలు తిన్నారు. తెలతెలవారకముందే రైతులు కుటుంబ సభ్యులతోపాటు తరలివచ్చి విత్తనాల కోసం వరసల్లో నిలబడ్డారు. ఎన్ని పడిగాపులు పడినా చాలినన్ని విత్తనాలు దొరక్కపోగా ఒంటినిండా గాయాలు మాత్రం మిగిలాయి. బుధవారం పలు జిల్లాల్లో ఇలాంటి బాధాకర సంఘటనలు చోటుచేసుకున్నాయి.
వరంగల్‌ జిల్లా రేగొండలో పత్తి విత్తన పర్మిట్ల కోసం వరసలో నిలబడిన రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. రేగొండ, తిర్మలగిరి, భాగిర్దిపేట, నారాయణపురం గ్రామాలకు చెందిన రైతులకు పర్మిట్లు పంపిణీ చేయనున్నట్లు అధికారులు గ్రామాల్లో ముందుగా దండోరా వేయించడంతో తెల్లవారుజామున 4 గంటల కల్లా రేగొండలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట రైతులు బారులు తీరారు. అధికారులు 7 గంటలకు రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జి చేశారు.

* ఇదే జిల్లా శాయంపేట మండలం పెద్దకోడేపాక గ్రామంలో దాదాపు వెయ్యి మంది రైతులుండగా బుధవారం 135 పత్తి విత్తన సంచులే వచ్చాయి. ఉదయం 5 గంటల నుంచే రైతులు వరసలు కట్టారు. మహిళల వరసలో తోపులాట జరగడంతో శాయంపేట ఎస్సై వేణుమాధవ్‌ వారి రెక్కలు పట్టుకొని వెనక్కి లాగారు. కానిస్టేబుళ్లూ ఇదే పద్ధతి అనుసరించడంతో మహిళలు వారితో వాగ్వివాదానికి దిగి తీవ్ర నిరసన తెలిపారు.

లాటరీ తగిలితేనే.. విత్తనం! రైతులు నుంచి డిమాండు ఉన్న కంపెనీలకు చెందిన విత్తనాలకు తీవ్ర కొరత ఉండటంతో.. అదృష్టమున్న వారికే వాటిని అందిస్తామంటున్నారు వరంగల్‌ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు. అదీ ఒక్కొక్కరికి ఒక ప్యాకెట్‌ మాత్రమే. ‘గ్రామానికి కేటాయించిన విత్తన సంచులు ఎవరెవరికి కావాలనేది జాబితా తయారు చేసి పంపిస్తే.. పర్మిట్లు ఇస్తాం’ అని వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో గ్రామాల వారీగా ప్రజలు చర్చించుకుని విత్తనాల భాగ్యం దక్కించుకునే రైతుల్ని ఎంపిక చేసేందుకు లాటరీలు తీస్తున్నారు. కొన్నిచోట్ల వేలంపాట పద్ధతిలో ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే, వారికే విత్తనాలు అందిస్తున్నారు. గూడూరు, చేర్యాల, నర్మెట్ట మండల్లాలోని పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధుల సమక్షంలో లక్కీడ్రాలు తీసి విత్తనాలు పంపిణీ చేశారు.
గుడి నిర్మాణానికి చందా ఇస్తేనే.. చెన్నారావుపేట మండలం గురిజాలలో విత్తన లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన లాటరీ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. స్థానికంగా కొంతమంది ఒత్తిడికి తలొగ్గిన అధికారులు గ్రామంలో నిర్మించే దేవాలయానికి చందాలు ఇచ్చుకున్న వారితోనే లాటరీ తీశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న వ్యవసాయాధికారి లాటరీని రద్దు చేస్తున్నామనీ, మళ్లీ గురువారం నిర్వహిస్తామని ప్రకటించారు.
కుటుంబమంతా వరసలో.. ఆదిలాబాద్‌ జిల్లాలో మంగళవారం భారీ వర్షం కురిసింది. విత్తనాలకు ఒక్కసారిగా డిమాండు పెరిగింది. డిమాండ్‌ ఉన్న విత్తనాల కోసం రైతులు కుటుంబ సభ్యులతో తరలుతున్నారు. బుధవారం భైంసాలోని గాంధీ గంజ్‌ దాదాపు నాలుగు వేల మందితో నిండిపోయింది. రైతులు తమ కుటుంబాల్లోని మహిళలు, చిన్నారుల్ని సైతం వరసల్లో నిలబెట్టారు. తోపులాటలు, గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

[¯Ãª½Öoª½Õ «Õ¢œ¿© ꢓŸ¿¢©ð X¾Ah NÅŒh-¯Ã©Õ X¾¢XÏºÌ Í䧌Ö-©E œË«Ö¢œþ Í䮾Öh éªjÅŒÕ©Õ ªÃ²Äh-ªîÂîÂ¹× C’ê½Õ. ª½Ö.930ÂË N“¹-ªá¢-ÍÃ-LqÊ NÅŒh¯Ã© ®¾¢<E ª½Ö.1200Â¹× Æ«át-ÅŒÕ-¯Ão-ª½E ‚ªî-XÏ¢-Íê½Õ. 

¹©ã-¹dªý Eª½g-§ŒÖ-EÂË «uA-êª-¹¢’à éªjŌթ Ÿµ¿ªÃo
NÅŒh-¯Ã©Õ ®¾“¹-«Õ¢’à ®¾ª½-X¶¾ªÃ •J-ê’©Ç ÍŒª½u©Õ B®¾Õ-Âî-©ä-Ÿ¿¢{Ö «u«-²Ä-§ŒÕ-¬ÇÈ •œ¿aª½x ®¾£¾É§ŒÕ ®¾¢ÍÃ-©-¹ל¿Õ(\œÎ) Æ•-§ýÕ-¹×-«Öªý X¶¾Õð†ýÊÕ ®¾éª¢-œ¿ª½Õ Í䮾Öh «Õ£¾Ç¦Ö-¦ü-Ê-’¹ªý >©Çx ¹©ã-¹dª½Õ X¾Ûª½Õ-³ò-ÅŒh¢-骜Ëf …ÅŒh-ª½Õy©Õ èÇK Íä¬Çª½Õ. DEåXj Âí¢ÅŒ-«Õ¢C éªjÅŒÕ©Õ Eª½-®¾Ê «u¹h¢ Í䮾Öh •œ¿a-ª½x©ð ªÃ²Äh-ªîÂî Eª½y-£ÏÇ¢* ¹©ã-¹d-ª½ÕÂ¹× «uA-êª-¹¢’à E¯Ã-ŸÄ©Õ Íä¬Çª½Õ. ‘\œÎ Æ•-§ýÕ-¹×-«Öªý éªjŌթ Â¢ Ɠ¹«Õ „Ãu¤Ä-ª½Õ-©åXj ÍŒª½u©Õ B®¾Õ-Âî-«-œ¿„äÕ ¯äª½«Ö?Ñ ÆE “X¾Po¢Íê½Õ. ¨ …Ÿ¿¢-ÅŒ¢åXj \œÎ Æ•-§ýÕ-¹×-«Öªý N©ä-¹-ª½Õ-©Åî «ÖšÇx-œ¿ÕÅŒÖ.. >©Çx ¹©ã-¹dª½Õ ÅŒÊåXj ¹¹~ ²ÄCµ¢X¾Û ÍŒª½u-©Â¹× ¤Ä©p-œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½E ‚ªî-XÏ¢-Íê½Õ. ÂíEo ¯ç©© “ÂËÅŒ¢ ²ÄnE¹ £¾ÇJÅŒ X¶¾Jd-©ãj-•ªýq ÊÕ¢* «Ö° «áÈu-«Õ¢“A „çj.‡®ý. ¦Ç«-«Õ-JC ¹¢åX-FÂË ÅŒª½-L-®¾ÕhÊo >©ÇxÂ¹× Íç¢CÊ ‡ª½Õ-«Û-©ÊÕ ÅÃÊÕ Æœ¿Õf-Âî-«œ¿¢ «©äx ÅŒÊåXj ¹¹~ ²ÄCµ-®¾Õh-¯Ão-ª½-¯Ãoª½Õ.

*NÅŒh-¯ÃLo ÆCµÂ¹ Ÿµ¿ª½-©Â¹× Æ«át-ÅŒÕ-¯Ão-ª½Êo éªjŌթ X¶ÏªÃuŸ¿Õ „äÕª½Â¹× •œ¿a-ª½x-©ðE 8 «Õ¢C NÅŒhÊ œÎ©-ª½xåXj ê®¾Õ©Õ Ê„çÖŸ¿Õ Íä®Ï Æ骮¾Õd Íä¬Çª½Õ. D¢Åî ÆCµÂ¹ Ÿµ¿ª½-©Â¹× ÆNÕtÊ „ÃJE ÂùעœÄ ƒÅŒ-ª½Õ-©åXj ê®¾Õ©Õ Ê„çÖŸ¿Õ Íä¬Ç-ª½E Eª½-®¾Ê Åç©Õ-X¾ÛÅŒÖ NÅŒhÊ, ‡ª½Õ-«Û© œÎ©ª½Õx Ÿ¿ÕÂÃ-ºÇ©Õ «â®Ï-„ä-¬Çª½Õ.


అన్నదాత కన్నెర్ర

జడ్చర్లలో విత్తన దుకాణాలపై రైతుల దాడి
మూడుచోట్ల లూటీలు. ఉద్రిక్త పరిస్థితి
డీలర్ల లైసెన్సులు రద్దు.. దుకాణకరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లోనూ ఆందోళనలు

ప్రభుత్వం ఎప్పట్లా పత్తి విత్తనాల సరఫరా విషయంలో ప్రేక్షక పాత్ర పోషిస్తుండడంతో రైతు తల్లడిల్లుతున్నాడు. ఓ వైపు వానలు రైతును వూరిస్తున్నాయి..మట్టి వాసన చేలోకి రారమ్మని ఆహ్వానిస్తుంటే..ఇంకో వైపు పత్తి విత్తనాల కోసం ఆందోళన తీవ్రమవుతోంది. నిర్ణీత రేటును మించి వ్యాపారులు వసూలు చేస్తున్నారని మహబూబ్‌నగర్‌ జిల్లా రైతులు ఆగ్రహావేశాలు చూపించగా…కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లోనూ విత్తనాల కోసం ఆందోళనలు చెలరేగాయి.  వ్యాపారులు పత్తి విత్తనాలకు అధిక ధరలు వసూలు చేయడంతో సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో విత్తనాల కోసం వచ్చిన రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దుకాణాలపై రాళ్ల వర్షం కురిపించారు. మూడుచోట్ల లూటీలు జరిగాయి. జడ్చర్లలోని విత్తన డీలర్లు దాదాపు 10 మంది లైసెన్సులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించి, దుకాణాలను సీజ్‌ చేశారు. విచారణ నిర్వహించి అధిక ధరలకు విత్తనాలు అమ్మిన వ్యాపారులపై చర్యలు తీసుకొంటామని ఆర్డీవో విలేఖరులకు వివరించారు. బాదేపల్లి మార్కెట్లోనే విత్తనాలు పెట్టి విక్రయిస్తామని ప్రకటించారు.అంతటితో రైతులు శాతించారు. ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బియ్యం ఎగుమతుల కోసం.. మిల్లర్ల లాబీయింగ్ తీవ్రం


హైదరాబాద్, జూన్ 8: బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతించాలంటూ మిల్లర్లు కేంద్రంపై లాబీయింగ్ తీవ్రం చేశారు. ఇదే జరిగితే రాష్ట్రంలో బియ్యం ధరలు చుక్కలనంటుతాయని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఎప్పుడూ లేనంత ధాన్యం దిగుబడి వచ్చింది. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగి.. ఐకేపీ కేంద్రాలు, ఎఫ్‌సీఐ, పౌరసరఫరాలశాఖ ద్వారా కనీస మద్దతుధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఫలితంగా మిల్లర్లు కూడా ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాల్సి వచ్చింది.

ఉభయ గోదావరి, నల్లగొండ, కరీంనగర్, నెల్లూరు జిల్లాల్లో కొంత మంది రైతుల నుంచి ఏవన్ రకం (మసూరీ) ధాన్యాన్ని మద్దతు ధరకన్నా ఎక్కువే చెల్లించి తాము కొన్నామని మిల్లర్లు చెబుతున్నారు. అందువల్ల సన్నబియ్యాన్ని ఎగుమతి చేసుకోవటానికి అనుమతివ్వాలని వీరు పైరవీ చేస్తున్నారు. గతంలో రోశయ్య ప్రభుత్వంపై గుంటూరు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ద్వారా మిల్లర్లు ఈ దిశగా ఒత్తిడి తెచ్చారు. ఇప్పుడు కూడా ఆ నేత ద్వారానే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లాకు చెందిన మిల్లర్లు మాట్లాడుతూ.. ప్రతి మిల్లర్ వద్ద 23 -26 వేల క్వింటాళ్ల వరకు బియ్యం నిల్వలున్నాయని తెలిపారు.

ఇలాంటి పరిస్థితుల్లో.. బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసుకొనేలా తమకు అవకాశం కల్పిస్తే.. రైతులకు, ఐకేపీ గ్రూపులకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మిల్లర్ మాట్లాడుతూ.. “విదేశాలకు మేం ఎగుమతి చేసేది సన్నబియ్యాన్ని మాత్రమే. పౌరసరఫరాల శాఖ గానీ, పేదలు గానీ దొడ్డు బియ్యమే కొంటారు. అలాంటప్పుడు సన్నబియ్యం ఎగుమతులకు అనుమతిస్తే తప్పేంటి?” అన్నారు. అయితే.. దేశంలో ఇటీవల 70% ప్రజలు సన్న బియ్యాన్నే తింటున్నారు. ఇది ఎగుమతి కావడం సహేతుకం కాదంటున్నారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి థామస్ కూడా ఎగుమతుల పట్ల విముఖత చూపిన విషయాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు.

https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/jun/9/main/9main30&more=2011/jun/9/main/main&date=6/9/2011

రుతుపవనాల వ్యాప్తికి వాతావరణం అనుకూలం

విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు తెలంగాణ, కోస్తాంధ్రల్లో ప్రవేశించడానికి ఒకటి రెండు రోజులు పట్టే అవకాశం ఉందని విశాఖలని తుపాను హెచ్చరికలకేంద్రం తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌నుంచీ దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర తీరం మీద ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడింది. వీటి ప్రభావం వల్ల ఉత్తర కోస్తాలో పలు చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణల్లో కొన్నిచోట్ల వానలు, లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా వ్యాపించడానికి మరో రెండుమూడ్రోజులు పట్టవచ్చని అధికారుల అంచనా. అయితే ముందుగా ప్రిమాన్‌సూన్‌ షవర్స్‌ కురిసే అవకాశం ఉంది. రుతుపవనాలు వ్యాపించడానికి పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని వారు తెలిపారు.

విత్తనాల కోసం రైతుల ఆందోళన

వరంగల్‌: విత్తనాల కోసం వరంగల్‌ జిల్లా రైతన్నలు ఆందోళన బాట పట్టారు. రైతులకు సరిపోను విత్తనాలు సరఫరా చేయాలని డిమాండ్‌చేస్తూ జిల్లావ్యాప్తంగా రైతులు రోడ్డెక్కారు. నర్సింహులు పేట మండలం దంతాపల్లిలో ఖమ్మం-వరంగల్‌ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రైతులు హైదరాబాద్‌, వరంగల్‌ రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. దీంతో రెండువేపులా భారీ ఎత్తున వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం తక్షణం స్పందించి విత్తనాలు సరఫరా చేయాలని రైతులు కోరారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోవడం కూడా రైతుల ఆందోళనకు మరో కారణం.